నేను అభిమన్యున్ని కాదు.. అర్జున్ని..చూసుకుందాం రండీ – సీఎం జగన్‌

-

ఏపీ రాజకీయాలపై సీఎం జగన్‌ సంచలన ట్వీట్‌ చేశారు. నేను అభిమన్యున్ని కాదు.. అర్జున్ని..చూసుకుందాం రండీ అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు…అన్నారు. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం…మీరంతా సిద్ధమా…? అంటూ సవాల్‌ చేశారు సీఎం జగన్‌.

YS Jagan Mohan Reddy Tweet Viral

ఇది ఇలా ఉండగా, భీమిలిలో శనివారం నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఆంధ్ర ప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. 14 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మార్క్‌ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్‌ మాత్రమే కనిపిస్తుందని అన్నారు. ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి జగన్‌ పూరించారు. ప్రతి ఇంట్లో వైసీపీ లబ్ధిదారుడు ఉండటం చూసి 75 ఏళ్ల వయసు మళ్లిన చంద్రబాబు భయపడుతున్నాడని సీఎం జగన్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version