కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల?

-

కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు పూర్తి స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

YS Sharmila’s responsibilities as AP PCC chief today

ఏఐసీసీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన 13 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలోనే…కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ కడప నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో వైఎస్ షర్మిలను దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్టీ నుండి అవినాష్ రెడ్డి బరిలో ఉండడంతో సోదరుడిపై పోటీ చేపించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version