మంచిని మైకులో చెప్పండి.. చెడును చెవిలో చెప్పండి అని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీభవన్ లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంత మంది చెడును మైకులో చెప్పి.. మైకులో మంచిని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో కష్టపడ్డవారికి పదవులు ఇచ్చాం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. పార్టీ కోసం కష్టపడకపోతే వన్ టైమ్ సెటిల్ మెంటే అన్నారు.
ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తున్నాం. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదు. ప్రధాని మోడీ అలా ప్రమోట్ చేసుకున్నారు. పన్నుల వసూళ్లలో తెలంగాణ టాప్.. కానీ గుజరాత్ రాష్ట్రం ఆరో స్థానంలో ఉందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం అన్నారు. బీజేపీని దించాలంటే తెలంగాణ నుంచి ప్రారంభమవ్వాలన్నారు. విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడండి అని సూచించారు.