YSR అంటే వైవీ సుబ్బారెడ్డి..విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మీరా వైఎస్సార్ వారసులు అంటూ వారిపై విరుచుకుపడ్డారు. ప్రకాశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కోసమే మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ లోకి వచ్చిందన్నారు. ఇక్కడి టీడీపీ, వైసీపీలు బీజేపీకి అమ్ముడుపోయాయి కాబట్టే ఏపీ లోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.
వైఎస్సార్ రక్తం ఈ బిడ్డలో ప్రవహిస్తుంది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని.. విభజన హామీలు నెరవేరాలని అడుగుపెట్టిందని పేర్కొన్నారు. మళ్లీ రైతులు రాజవ్వాలి.. రైతులకు రుణమాఫీ కావాలి..అన్నీ వైపుల నుంచి నాపై దాడి మొదలు పెట్టారన్నారు. వైఎస్సార్ అద్భుతంగా ప్రాజెక్టు కట్టించి వెళ్లిపోతే ప్రస్తుతం మెయింటెనెన్స్ చేసే దిక్కు దివాణం లేకుండా పోయిందని విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని ఆయన ఆశయాలు నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. ఏపీలో బీజేపీ అంటే బి అంటే బాబు..జే అంటే జగన్..పి అంటే పవన్.. అని…ఈ మూడు పార్టీల్లో ఎవరికీ ఓటు వేసినా…. బీజేపీకి వేసినట్లేనన్నారు.