ఏపీ హై కోర్టులో వై.ఎస్ సునితారెడ్డి పిటిషన్.. ఆ కేసు కొట్టేయాలంటూ..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె వై.ఎస్.సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పీఏ కృష్ణారెడ్డి తమపై తప్పుడుగా ప్రైవేట్ ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జీ షీట్ తో పాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ హైకోర్టును కోరారు. 

పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే వై.ఎస్. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పలువురిపై పులివెందుల కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్, సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వై.ఎస్.వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ పులివెందుల కోర్టును ఆశ్రయించారు.ఈ తరుణంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్, వై.ఎస్. వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలంటూ పులివెందుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version