సంక్షేమ పథకాలతో జగన్ సర్కార్ దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా రకాల పథకాలు తీసుకొచ్చిన జగన్ సర్కార్.. తాజాగా మరో పథకానికి తెరలేపింది. ఏపీలో మరో పథకానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. అయితే.. తాజాగా ఈ పథకానికి చెందిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
#YSR కళ్యాణమస్తు..మార్గదర్శకాలు
అమ్మాయి వయసు 18,అబ్బాయి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు రూ. 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు రూ 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ ప్లేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.
తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించిన అర్హత శరతులు చూస్తే, అన్ని సంక్షేమ పథకాల లాగానే కళ్యాణమస్తు షాది తోఫా పథకానికి 6 దశల్లో తనిఖీలు ఉంటాయని తెలుస్తోంది. వధూవరులు ఇద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ. లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 1.20లక్షలు ఇస్తారు. బీసీలకు రూ. 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు రూ. లక్ష, దివ్యాంగులైతే రూ. 1.50లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 40వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.