పాపాలు కడుక్కోవడానికి బాబుకు అమర్నాథ్ సూచన ఇది!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారిపోతుంది! ప్రతిపక్షాలు చడీ చప్పుడు చేసే అవకాశాన్ని ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు వైఎస్ జగన్. మూడు రాజధానుల బిల్లును ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలపడం.. ఫలితంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ సంగతులు అలా ఉంటే… గతంలో చంద్రబాబు కలల రాజధాని కట్టేందుకు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, అందుకు తగిన శక్తిసామర్థ్యాలు తనవద్ద లేవని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు చేస్తే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆందోళనలు రావని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయం ఆమోదం వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనదైన శైలిలో స్పందించారు అమర్ నాథ్!

G మాట్లాడుతూ… సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయ‌ని అన్నారు. మూడు రాజధానులకు ఆమోదం లభించిన రోజును సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన దినంగా అభివ‌ర్ణించారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా సిఎం వైఎస్ జగన్‌ కి.. తమ ప్రాంత ప్ర‌జ‌ల తరపున కృతజ్ణతలు తెలుపుతున్నాన‌ని అన్నారు. గతంలో జ‌రిగిన తప్పిదాలు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చార‌ని.. గడిచిన అనేక ఏళ్లుగా ఒకే ప్రాంతాల‌ను అభివృద్ది చేయడం చూశామని… దీంతో ఏ విధంగా మనం నష్టపోయామో అందరికీ తెలుసు అంటూ అమర్ నాథ్ వివరించారు. కాగా భవిష్యత్ లో మళ్లీ ప్రజలలో అసంతృప్తి రాకూడదనే.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకి ఎంతో‌ ఉపయోగకరంగా ఉంటుంద‌ని.. ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోకూడదు… ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వైఎస్ జగన్ భావించారని ఆయన వెల్లడించారు.

అదేవిధంగా వైఎస్ జగన్ ఓ చారిత్రాత్మిక నిర్ణయం తీసుకున్నారని.. ఆంధ్రులు కోల్పోయిన హైదరాబాద్ వంటి నగరంతో సమానంగా పోటీపడగల నగరం విశాఖ మాత్రమేన‌ని.. విశాఖకి ఎన్నో అవకాశాలున్నాయని వివరించారు. విశాఖకి ఉన్న‌ కనెక్టవిటీ అభివృద్దికి అవకాశంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరం అన్న నేతలు గత అయిదేళ్లూ ఏం చేశారు? అని ప్ర‌శ్నించారు అమ‌ర్‌నాథ్‌. కాగా ఏ నాయకుడు చేయని గొప్ప ఆలోచన సీఎం వైఎస్ జగన్ చేశార‌ని ప్రశంసల జల్లు కురిపించారు. మూడు రాజధానులకి‌ మద్దతు‌ పలికి తను చేసిన పాపాలు చంద్రబాబు కడుక్కోవాలని స‌ల‌హా ఇచ్చారు. చంద్రబాబు, ఆయన కొడుకు ఈ ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత కోల్పోయార‌ని తీవ్ర వాఖ్యలు చేశారు.

అంతేకాకుండా చంద్రబాబుకి మద్దతు పలికే ప్రతీ నాయకుడు రాజకీయాల్లో ఉండే అర్హత కోల్పోయినట్టేన‌ని అమర్ నాథ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచించే మీవంటి నాయ‌కుల‌కి నిజంగానే చీక‌టి రోజని ఎద్దేవా చేశారు. స్టేట్ కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తే.. మీరు రియల్ ఎస్టేట్ కోసం ఆలోచన చేస్తారు? అంటూ మండిప‌డ్డారు. మీకు రాజకీయ బిక్ష పెట్టి… పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ చనిపోయిన‌ప్పుడు రాని కన్నీళ్లు ఇప్పుడు వ‌స్తున్నాయా? అంటూ ప్ర‌శ్నాస్త్రాన్ని సంధించారు. బోయపాటితో మీరు సినిమా తీసిన సందర్బంలో‌ పుష్కరాల్లో 20 మంది చనిపోతే ఎందుకు కన్నీళ్లు రాలేదు? అంటూ అమర్ నాథ్ మండిపడ్డారు. విశాఖను ఏ స్ధాయిలో అభివృద్ది చేస్తామో.. అదే విధంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామ‌ని అమర్ నాథ్ భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version