వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

-

పులివెందుల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో నేడు జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్టు అయ్యాడు.

YSRCP MP Avinash Reddy , MP Avinash Reddy , pulivendula
YSRCP MP Avinash Reddy pre-arrested

ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కూటమి, వైసీపీ పార్టీలు తీసుకున్నాయి. జగన్ కంచుకోటలో జెండా ఎగురవేయాలని టీడీపీ ప్లాన్ వేస్తోంది. కాగా నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల జడ్పీటీసీ ఫలితం గురువారం తేలనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news