నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల జడ్పీటీసీ ఫలితం గురువారం తేలనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు.

పోలింగ్ కోసం 1400 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కాసేపటి క్రితమే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రారంభం కూడా అయింది. ఇక అటు పులివెందుల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్ అయ్యారు.
అవినాష్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో నేడు జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్టు అయ్యాడు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కూటమి, వైసీపీ పార్టీలు తీసుకున్నాయి. జగన్ కంచుకోటలో జెండా ఎగురవేయాలని టీడీపీ ప్లాన్ వేస్తోంది.