ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఒకవైపు ఉంటే మిగతా పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు స్కామ్ లు బయటపడ్డాయని, చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలన్నారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆయనకు నలుగురు ష్యురిటీ ఇచ్చారని తెలిపారు. ఆయన కుప్పంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందని వాక్యానించారు.
కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిడిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. తనపై నమోదైన FIR, క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని CBN పిటీషన్ లో పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17Aని ఉదాహరిస్తూ తన అరెస్టును సవాల్ చేశారు. ఈ కేసులో 52 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.