వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించిన జగన్ !

-

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలకు మరోసారి ప్రాధాన్యత ఇచ్చారు. వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డిలకు అదనపు బాధ్యతలు అప్పగించారు జగన్. ఉమ్మడి కర్నూలు, వైయస్ఆర్ జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్.

YV Subbareddy and Peddireddy have been given additional responsibilities by Jagan

అటు ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న వై.వి. సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. ఇతర నాయకులపై నమ్మకం లేకపోవడం, ధీటైన నాయకుడు లేకపోవడంతో వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డిలకు అదనపు బాధ్యతలు అప్పగించారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version