కాన్వాయ్ ని ప‌క్క‌న పెట్టొస్తా..ఎవ‌డొస్తాడో రండి..మంత్రి స‌వాల్..!

-

ఏపీ మంత్రి అనిల్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ పై అనిల్ కుమార్ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. లోకేశ్… నీ అబ్బ నిజంగా రాయలసీమలో పుట్టింటే రా… తేల్చుకుందాం అంటూ స‌వాల్ విసిరారు. ఎవరు ఎవరి రెక్కలు ఊడగొడుతారో, ఎవరు ఎవర్ని తరిమికొడతారో చూద్దామంటూ అనిల్ కుమార్ రెచ్చిపోయారు. వారం రోజులు నెల్లూరులోనే ఉంటా… ఒక్కడినే తిరుగుతా… దమ్ముంటే అడ్డుకోండి అంటూ స‌వాల్ విసిరారు. అవ‌స‌రమైతే కాన్వాయ్ ను కూడా ప‌క్క‌న పెడుతా ఎవ‌డొస్తాడో రండి అంటూ ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌డు తాకుతాడో చూస్తాం..ఎవ‌డొస్తాడో రండి అంటూ అనిల్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా లోకీ చ‌ర్మ ఒలిచేస్తారు అంటూ అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్… నీకు కూడా చెబుతున్నా.. సీఎంని తిట్టినప్పుడు మౌనంగా ఉండి, ప్రజాస్వామ్యం అపహస్యమైందని అంటావా…అంటూ ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు. సీఎం ఫ్యాక్ష‌నిస్ట్ అయితే మీరంతా ఉండేవారా అంటూ ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version