పార్టీ కన్నతల్లి లాంటిది..DMK లాగా మనం ఎదగాలి : కేటీఆర్‌

-

ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటే కన్న తల్లి లాంటిదని… లీడర్లు స్వార్థాలు లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. బాగా పనిచేసి… డీఎంకే పార్టీ లాగా మనం కూడా బలోపేతం కావాలని కోరారు కేటీఆర్‌. పార్టీ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని… ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని …పార్టీని నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌.

మీకు పదవులు వచ్చిందే టీఆర్‌ఎస్‌ పార్టీ వల్ల అని గుర్తు పెట్టు కోవాలని తెలిపారు. పదవుల్లో ఉండి పార్టీ కమిటీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అటువంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.. అటువంటి వారు ఉంటే తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే తొమ్మిది నెలలు వరుసగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని… పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు మంత్రి కేటీఆర్‌. అందరి పార్టీలో కలుపుకుపోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version