యాక్షన్-కామెడీతో.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..

-

ఏ పాత్రనైనా నందమూరి బాలకృష్ణ అవలీలగా చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేయబోతున్నారు. బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. బాలకృష్ణ 100వ సినిమానే తాను చేయాలనుకున్నాడు అనిల్ రావిపూడి. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. అయితే.. ఈ మధ్యనే బాలకృష్ణకి అనిల్ ఒక కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. బాలకృష్ణకు కెరియర్ పరంగా ఇది 107వ సినిమా.

రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను బాలయ్య పోషించనునట్లు సమాచారం. ఫస్టాఫ్ అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తోను .. సెకండాఫ్ అంతా కూడా అనిల్ మార్కు కామెడీతోను ఈ కథ నడుస్తుందట. అంతేకాకుండా.. ఈ సినిమాలో రవితేజ అతిథి పాత్రను పోషించనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version