వైసీపీపై షాకింగ్ కామెంట్స్.. పొత్తు తప్పదన్న వర్ల రామయ్య..

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. పవన్ వ్యాఖ్యలతో టీడీపీ పొత్తు ఖాయమని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీని కొట్ట‌డం అంత ఈజీ కాదంటూ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 151 సీట్లు గెలిచిన జ‌గ‌న్‌ను ఓడించాలంటే అంద‌రూ క‌ల‌వాల్సిందేన‌ని ఆయ‌న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీతో ప‌లు పార్టీల పొత్తుల‌కు సంబంధించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వర్ల రామయ్య. ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పాటు అన్ని పార్టీలు క‌లిసి వస్తాయ‌ని వర్ల రామయ్య అన్నారు. త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న కూడా అంద‌రూ క‌లిసి రావాల‌న్న దిశ‌గానే ఆలోచిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు వర్ల. టీడీపీతో బీజేపీ పొత్తు విష‌యం చెప్పాల్సింది సోము వీర్రాజు కాద‌ని కూడా వ‌ర్ల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version