జంతువుల అక్రమ రవాణా.. కాటన్ బాక్సుల్లో చింపాంజీలు

-

ఇటీవలి కాలంలో జంతువుల అక్రమ రవాణా పెరిగిపోతోంది.అడవుల్లో స్వేచ్చగా తిరుగాల్సిన వన్యప్రాణులను కాటన్ బాక్సుల్లో ప్యాక్ చేసి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను చెన్నై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చెన్నైకి అట్టపెట్టెల్లో చింపాంజీ పిల్లలు, ఊసరవెల్లులను అక్రమంగా తరలిస్తున్నారు. చెన్నై శివారుల్లోని ఫామ్‌హౌస్‌లలో కొందరు బడాబాబులు చింపాంజీలు, ఊసరవెల్లులను పెంచుకుంటున్ను విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వారి కోసమే కౌలాలంపూర్ నుంచి విమానంలో ఓ మహిళ చింపాంజీ పిల్లలను,వివిధ రకాల ఊసర వెల్లులను అక్రమ రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఆమె మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పటివరకు ఎటువంటి జంతువులను రవాణా చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు. గతంలోనూ చైన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా వణ్యప్రాణులను తరలించే వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version