ప్రముఖ సింగర్ తో ప్రేమాయణం నడుపుతున్న అనిరుధ్..!

-

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకి కూడా తనదైన శైలిలో సంగీతాన్ని అందిస్తూ బిజీగా మారిపోయిన ఈయన.. సంగీత ప్రపంచంలో తన పేరును బ్రాండ్ గా మార్చుకున్నారు. ఇక ఆయన నుంచి వచ్చే ప్రతి పాట కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందే కావడం గమనార్హం. 20 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చి సీనియర్లకే గట్టి పోటీ ఇచ్చిన ఈయన తెలుగులో అజ్ఞాతవాసి అనే చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.

ఇప్పుడు దేవర సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే సంగీతంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి సినీ పరిశ్రమలోని నటీమణులతో రిలేషన్ షిప్ లో ఉన్నాడన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. గతంలో కోలీవుడ్లో సుచీ లీక్స్ పేరుతో పలు ఫోటోలు బయటకు రాగా హీరోయిన్ ఆండ్రియా తో డీప్ లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో అప్పట్లో మరింత సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయన చుట్టూ మరో కొత్త వివాదం రేగుతోంది. అరబిక్ కుత్తూ పాట పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ జోనితా గాంధీతో ఇతడు ఎఫైర్ పెట్టుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

విక్రమ్ సినిమా నుంచి వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వీరిద్దరూ మీడియా కంటపడడంతో ఇక నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇలాంటి వార్తలు వస్తున్నా కూడా వీరిద్దరూ ఈ విషయంపై స్పందించలేదు. మరి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అని తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version