ఏపీలో మహిళలకు గన్ లైసెన్స్ ఇవ్వాలి – వంగలపూడి అనిత

-

జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పేరిట రెండో సంచికను విడుదల చేశారు టీడీపీ మహిళా నేతలు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిభా భారతి, వంగలపూడి అనిత. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ… మహిళల రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో మహిళలు తమకు తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని.. రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే మాకే సిగ్గనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి నిన్నటి వరకు 60సంఘటనలు జరిగాయని.. చిన్న బిడ్డలపై అత్యాచారం జరిగితే మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు తన కార్యాలయంలో సెటైల్మెంట్లు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

సీఎం పరదాలు దాటుకుని జనం లోకి వస్తే ఆడబిడ్డల సమస్యలు తెలుస్తాయని.. జగన్ పాలన రేపుల రాజ్యoగా మారిందని మండిపడ్డారు. కీచకులు చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వంలో చలనం లేదని.. జగనుకు తగ్గట్లుగానే పోలీసుల తీరూ ఉందని ఓ రేంజ్‌ లో ఫైర్‌అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version