వచ్చిన ఒక్క అవకాశాన్ని అంజలి వాడుకోలేకపోయిందా…!

-

అంజలి ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా కరెక్ట్‌గా ఉపయోగించుకోలేకపోయింది. పోలీస్‌ ఆఫీసర్‌ అంటే బాడీలాంగ్వేజ్‌లో ఒక ఆటిట్యూడ్‌ కనిపిస్తుంది. అదే క్రైమ్‌ బ్రాంచ్‌ అంటే ఇంకా షార్ప్‌గా కనిపిస్తుంటారు. కానీ ‘నిశ్శబ్ధం’లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన అంజలిలో మాత్రం ఇలాంటిదేం కనిపించలేదంటున్నారు ప్రేక్షకులు. అంజలికి ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా వాడుకోలేకపోయింది. ఇంక మూటాముల్లె సర్దుకోవాల్సిందే అని కామెంట్‌ చేస్తున్నారు.

అంజలికి ఇప్పటికే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ‘వకీల్‌సాబ్‌’లో సపోర్టింగ్ రోల్ తప్ప పెద్దగా భారీ సినిమాలు కూడా లేవు. ఇలాంటి టైమ్‌లో పూర్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అంజలికి డోర్స్‌ క్లోజ్ అవుతున్నాయని, హీరోయిన్‌గా సినిమాలు రావడం కష్టమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.కష్టాల్లో ఉన్న కెరీర్‌ని గట్టెక్కించుకోవాల్సిన టైమ్‌లో పూర్‌ పెర్ఫామెన్స్‌తో మరింత ప్రాబ్లమ్స్‌లో పడిపోయింది. కెరీర్‌ని డేంజర్‌ జోన్‌లోకి నెట్టేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version