తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022-23 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు దిశగా పని చేస్తామన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం… ఈ బడ్జెట్ లో ఏకంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. గ్రామీణ స్థాయి విద్యార్థులు.. మెడిసిన్ చదివేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు.