మాజీ ఎంసీ నందిగం సురేశ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురైంది. మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారించిన అనంతరం ఈ హత్య కేసులో ఛార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్‌ సుప్రీం కోర్టు కొట్టేసింది.

కాగా, 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్‌ను దూషించింది. దీంతో మరియమ్మ ఇంటిపై అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేసి మహిళను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై విచారణకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version