మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీర్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. బీర్ల సరఫరా కంపెనీల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం 15 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లైట్, స్ట్రాంగ్ బీర్ల ధరలు అమాంతం పెరిగాయి. సుమారు రూ.20 నుంచి 30 మేర ధరలు పెరిగడంతో మందు బాబులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, మందుబాబులకు త్వరలోనే మరో షాక్ తగలనుందని తెలుస్తోంది. త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఇటీవల పెంచిన బీర్ల ధరల కారణంగా ఎక్సైజ్ శాఖకు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని టాక్.
మందుబాబులకు మరో షాక్
త్వరలో చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు సమాచారం
ఇటీవలే తెలంగాణలో బీర్ల ధరలు 15 శాతం పెంచిన రేవంత్ సర్కార్ https://t.co/HwNummndvG pic.twitter.com/w55SmUaZKf
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2025