బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రి వెళ్లారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే తన ఫామ్ హౌస్ లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే.
ఆయనకు డాక్టర్లు సర్జరీ చేశాక ఫుల్ రెస్టు తీసుకున్నారు. సుమారు ఏడాది పాటు ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అయ్యారు. ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను నిషితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈనెల చివర్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వెల్లడించిన విషయం తెలిసిందే.