గురుకుల ఆశ్రమ పాఠశాలలో మరో బాలిక మృతి..

-

గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే గత గత 15 నెలల్లో గురుకులాల్లో 83 మంది విద్యార్థులు మృతి చెందినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.విద్యాశాఖ మంత్రి లేక రాష్ట్రంలో విద్యావ్యవస్థ అదుపు తప్పుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే, కూతురు మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని బోధ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

https://twitter.com/TeluguScribe/status/1898971855278551110

Read more RELATED
Recommended to you

Exit mobile version