తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలలో ఒకటిగా నిలిచిన మంచు ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. లేదు ఇక ఈ కుటుంబం నుంచి వచ్చిన మంచు మోహన్ బాబు అలియాస్ భక్తవత్సలం నాయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .. స్వర్గీయ దాసరి నారాయణరావు సహాయంతో ఇండస్ట్రీలో అంచలంచలు గా ఎదుగుతూ నేడు విద్యాసంస్థల అధినేతగా , ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసులలో ఒకరైన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకపక్క మా అధ్యక్ష పదవిని చేపట్టి పలు కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరొక పక్క సినిమాలలో చాలా యాక్టివ్ గా ఉంటూ కనిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మంచు విష్ణు తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక హీరోగా ఆయన నటిస్తున్న జిన్నా సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది . ఇందులో పాయల్ రాజపుత్ తో పాటు సన్నీలియోన్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన విష్ణు ఫస్ట్ లుక్ టైటిల్ కూడా చాలా విభిన్నంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మంచు విష్ణు ఇద్దరు కూతుర్లు అయినా అరియానా.. వివియానాలు ఇద్దరూ కలిసి ఒక పాటను పాడారు. ఇక ఆ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా మంచు విష్ణు ప్రకటించడమే కాకుండా ఒక ఆసక్తికరమైన లేఖను కూడా అభిమానులతో పంచుకోవడం జరిగింది.