మరో మస్తాన్ సాయి.. బెదిరింపులకు పాల్పడి రెండున్నర కోట్లు వసూలు..!

-

అసభ్యకర వీడియోల పేరుతో దేవనాయక్ అనే ఈ కేటుగాడు బెదిరింపులకు పాల్పడి.. రెండున్నర కోట్లు వసూలు చేశాడు. ఇతను మరో మస్తాన్ సాయిలా వ్యవహరించాడు.  హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. కూకట్‌పల్లి హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి అదే హాస్టల్‌లో ఉంటున్న మరో యువతి అనుషా.. అయితే  ఆమె భర్త దేవనాయక్ తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది.  ఒక కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి మారు పేరుతో యువతికి కాల్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయని వాటిని వెబ్ సైట్లలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అతనే అసలైన మోసగాడని చేస్తున్నాడని తెలియక.. దేవనాయక్ తో ఈ విషయం పంచుకున్నది బాధితురాలు.  మేటర్ సెటిల్ చేస్తానని..గత మూడేళ్లుగా విడతల వారీగా. రూ.2.53. కోట్లు వసూలు చేశాడు. ఈ వ్యవహారంతో భయపడి కూతుర్ని తమ సొంతూరు నిడదవోలుకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు.  చివరికి.. మోసపోయానని గ్రహించి నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.  దేవనాయక్ ని అరెస్ట్ చేసి .. రూ.1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు నిడదవోలు పోలీసులు.  నిందితుడు దేవనాయక్ ది గుంటూరు జిల్లా చినకాకాని. అతని దగ్గర ఆమెకు సంబంధించిన ఎలాంటి న్యూడ్ వీడియోలు లేవు..కానీ ఉన్నాయని బెదిరించాడు
పరువు పోతుందనే భయంతో అప్పులు చేసి, ఇంటిని , స్థలాలను తాకట్టు పెట్టి మరీ రెండున్నరకోట్లు ఇచ్చారు యువతి తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version