స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. బీజేపీ, బీఆర్ఎస్ కి సీఎం సవాల్

-

బీసీలకు రిజర్వేషన్ల పై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. చట్టప్రకారం.. స్థానిక సంస్థల్లో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ చట్ట ప్రకారం.. 42 శాతం ఇప్పుడు సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా..? అని బీఆర్ఎస్, బీజేపీ కి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.

భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, డీ.కే.అరుణ కుటుంబ సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వొద్దని సభాపతిని కోరారు. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేను మంత్రివర్గం, అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.  ఆ సర్వేను ఓ కుటుంబం దాని పెట్టుకుందని విమర్శించారు. ఆ సర్వేను వెబ్ సైట్ లో పెట్టామని కేటీఆర్ పెట్టగా.. అధికారిక వెబ్ సైట్ లో పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version