భారత్‌లో మరో కొత్త ఎయిర్‌లైన్స్.. విమానం ఫస్ట్ లుక్ అదిరిందిగా!

-

భారత స్టాక్ మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పేరుపొందిన రాకేష్ జున్‌జున్‌వాలా కొత్తగా ఎయిర్‌లైన్స్ లోకి అడుగు పెట్టారు. ఆయన పెట్టుబడి పెట్టిన విమానయాన సంస్థ పేరు ‘ఆకాశ ఎయిర్’. దేశ ప్రజలకు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఆకాశ్ విమానరంగంలో ప్రవేశించింది. త్వరలోనే ఈ కంపెనీ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ కంపెనీకి చెందిన విమానం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆకాశ్ ఎయిర్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఆ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు ‘అందరూ సైలెంట్‌గా ఉండండి.. మా క్యూపీ-పీఐఈకి హలో చెప్పండి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఆకాశ-ఎయిర్

కాగా, ఆకాశ ఎయిర్ సేవలను ప్రారంభించేందుకు రాకేష్ జున్‌జున్‌వాలా దాదాపు రూ.262 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే విమానయాన కంపెనీకి సంబంధించిన లోగోను గతేడాదే లాంచ్ చేశారు. లోగో కోసం సన్‌రైజ్ ఆరెంజ్, పాషనేట్ పర్పుల్ రంగులను ఎంచుకున్నారు. ఈ రంగులు వేడి, శక్తిని సూచిస్తాయి. ఈ విమానాలు ప్రారంభ దశలోనే మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాలకు ప్రయాణించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి 12 నెలల్లో 18 విమానాలతో సేవలను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version