చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.2020,21లో విజృంభించిన కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు చిన్న దేశాలు అల్లాడిపోయాయి. ఎకానమీ దెబ్బతిని అప్పుల్లో కూరుకుపోయాయి. తాజాగా చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు క్యూ కడుతున్నట్లు సమాచారం.
హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా మళ్లీ విజృంభిస్తున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చైనాలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా, దీనిపై ఇంకా స్పష్టత లేదు.ఈ వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు సమాచారం. వైరస్ వ్యాప్తిని అక్కడి వైద్యశాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్జాతీయ కథనాలు వెలువడటం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుంది.