అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ వేశారు. కాంగ్రెస్​ పార్టీ నేత జయ ఠాకూర్​పిటిషన్​ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. కాంగ్రెస్ నేత పిటిషన్​ను సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ధర్మాసనం విచారణ స్వీకరించింది. ఇప్పటికే దాఖలైన రెండు పిటిషన్లతో పాటు జయ ఠాకూర్​ పిటిషన్​పై శుక్రవారమే విచారం జరపనున్నట్లు తెలిపారు.

మరోవైపు.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాత్రపై విచారణ జరిపించాలని జయ ఠాకూర్ కోర్టును కోరారు. లక్షలకోట్ రూపాయిల ప్రజాధనాన్ని మోసం చేసిన అదానీ గ్రూప్‌ కంపెనీలతో పాటు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జయ ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు. సీబీఐ, ఈడీ, డీఆర్‌ఐ, సెబీ, ఆర్‌బీఐ వంటి సంస్థలతో విచారణ చేపట్టాలని, అదే సమయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ కేసు విచారణ జరిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version