ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం అయ్యారు.
భారత జట్టు ప్రధాన రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, ‘రోహిత్, కుల్దీప్ సేన్, దీపక్ చాహార్ మూడో మ్యాచ్ లో ఆడరు. రోహిత్ ముంబైకి తిరిగి వచ్చి తన వేలికి గాయాన్ని స్పెషలిస్ట్ కు చూపిస్తాడు. అతను టెస్ట్ సిరీస్ లో ఆడగలడా లేదా అనేది మనం చెప్పలేని స్థితిలో లేము. మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు మినహాయింపు. అయిన టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తప్ప ఏమీ కాదు’ అని తెలిపాడు. ఒకవేళ రోహిత్ దూరం అయితే, టెస్ట్ కెప్టెన్ గా రాహుల్ బాధ్యతలు తీసుకోనున్నారు.