ఉరి శిక్షలో మరో ట్విస్ట్, అసలు ఉరి తీస్తారా…?

-

నిర్భయ అత్యాచారం నిందితుడి తరుపు న్యాయవాది మరోసారి పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు, తిహార్ జైలు అధికారులు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది ఎపి సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం పాటియాలా హౌస్ కోర్టులో విచారించనున్నారు. 2012 నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల్లో నలుగురిలో ఇద్దరు పవన్‌, అక్షయ్‌లకు,

క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను తీహార్ జైలు అధికారులు ఇంకా విడుదల చేయలేదని న్యాయవాది ఎపి సింగ్ ఆరోపించారు. మిగతా ఇద్దరు దోషులు – వినయ్ కుమార్ శర్మ (26), ముఖేష్ సింగ్ (32) లకు సంబంధించిన నివారణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులను ఫిబ్రవరి 1 న తీహార్ జైలు అధికారులు ఉరి తీయనున్నారు.

ఈ నేపధ్యంలో నిందితులకు ఉరి శిక్షను అమలు చేయించడానికి గాను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించింది. ఇప్పటికే ఈ ఉరి శిక్ష అమలు పలు మార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్షమాభిక్షకు వెళితే వారిని ఉరి తీస్తారా లేదా మళ్ళీ వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా నిందితులు నలుగురు కూడా ఇప్పుడు ఉరి శిక్షను అడ్డుకునే మార్గాలు లేక ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version