లగచర్ల ఘటనలో మరో ట్విస్ట్‌….వాళ్లు కూడా అరెస్ట్‌ !

-

లగచర్ల ఘటనలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. లగచర్ల ఘటనలో అరెస్టులు..కొనసాగుతున్నాయి. పోలీసుల అదుపులో మరో పది మంది నిందితులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా మొత్తం 21 మంది రిమాండ్ విధించారు. సంగారెడ్డి జైల్లో 20 మంది… చర్లపల్లిలో నరేందర్ రెడ్డి ఉన్నారు. మొదట పరిగి సబ్ జైల్లో 16 మందిని రిమాండ్ చేయగా… మరో నలుగురిని నేరుగా సంగారెడ్డి జైల్లో కి తరలించారు.

Another twist in the Lagacharla incident

పరిగిలో రిమాండ్ అయిన 16 మందిని సంగారెడ్డి జైలుకు ట్రాన్స్ ఫర్‌ చేశారు. ఇప్పటికే మొత్తం 21 మంది రిమాండ్ కు వెళ్లారు. ఇక ఈ సంఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పందించారు. లగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదని ఆగ్రహించారు. భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version