ఏపీ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త.. ఏపీకి త్వరలోనే మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. చెన్నై – నరసాపురం వందే భారత్ కు రైల్వే శాఖ ఈ విషయం పైన ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలియజేశారు. త్వరలోనే నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ రైలును ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అభినందించారు. కాగా, వందే భారత్ ట్రైన్లలో చార్జీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు చాలా తొందరగా వారి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవచ్చని ఈ ట్రైన్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో కొన్ని వందే భారత్ ట్రైన్ లో నడుస్తున్నాయి. ఇందులో చాలామంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయం పైన త్వరలోనే మరింత సమాచారం తెలియనుంది.