అద‌న‌పు క‌ట్నం వేధింపులు తాళలేక మరో మహిళ బలి …!

-

తనని అదనపు కట్నం తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నోయిడా లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నోయిడా కు చెందిన జ‌గ్వీర్ కుమార్ కు సోనమ్ తో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజుల వరకు సాఫీగా సాగిన వారి కుటుంబ నేపథ్యంలో.. కొద్ది రోజుల నుండి భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారు సర్దిచెప్పడంతో సంసారాన్ని కొనసాగించారు.

suscide

ఇలా జరిగిన తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత కూడా మళ్లీ అదే మహిళతో తన అక్రమ సంబంధానికి సాగిస్తున్నారు భర్త. ఈ నేపథ్యంలో వేరే అమ్మాయితో అసభ్యకరంగా దిగిన ఫోటోలు భార్యకు కంటపడటంతో ఆ విషయాన్ని తన అత్తమామలకు దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆమెకు మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా భర్త తల్లి, అలాగే అక్క చెల్లెలు కూడా సోనమ్ ను హింసించడంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని ఆవిడ తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే సోనమ్ గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని సోనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version