అయన చెప్పిన డైటింగ్‌ ప్లాన్‌తో బరువు తగ్గాను: అరవింద్‌స్వామి

-

తాజాగా ప్రముఖ నటుడు అరవింద స్వామి తన బరువును ఎలా తగ్గారో ఆయన తెలియజేశారు. అందులో భాగంగా తాను ఒక రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంతో పూర్తిగా బెడ్ కే పరిమితం కావడంతో దాదాపు 110 కేజీలకు బరువు చేరాడని తెలిపాడు. అయితే ఆ తర్వాత కాస్త కుదురుకున్న నేపథ్యంలో ఆ సమయంలో ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఇచ్చిన డైటింగ్ ప్లాన్ తో చాలా బరువు తగ్గానని ఆయన తెలియజేశారు. కడలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన అలనాటి విశేషాల గురించి చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ సినిమాకి కథ చెప్పిన తర్వాత ఆ పాత్రలో ఆయన నటించాలంటే చాలా కష్టం. కానీ ఆయన పట్టు వదలకుండా అనేక రకాల వర్కౌట్స్, డైటింగ్ మణిరత్నం గారు నాతో చేయించారని చెప్పుకొచ్చారు.

Aravind-Swamy

రోజులో అనేకసార్లు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం ద్వారా, బాగా వాకింగ్ పాటించడం ద్వారా కొద్దిరోజులకే తనలో చాలా మార్పులు చూసి నిజంగా ఆశ్చర్య పోయినట్లు తెలియజేశారు. ఇక ఆ తర్వాత తనని చూసిన మణిరత్నం పాత్రకు సరిపోతాడా అని చెప్పడంతో సినిమా మొదలుపెట్టారని తెలియజేశాడు. దాంతో నా రెండో ఇన్నింగ్స్ మొదలైంది అంటూ ప్రముఖ నటులు అరవిందస్వామి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version