ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. అప్పుల పాలు కావడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర బీహెచ్ ఈఎల్ కార్టర్స్‌లో ఉంటున్న రాజ్‌వీర్ సింగ్ ఠాకూర్ (25) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్స్, మద్యానికి బానిసయ్యాడు. అప్పుల తీర్చాలని ఇచ్చినవారు ప్రెజర్ చేయడంతో నిన్నరాత్రి గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు.
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ..‘ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసై మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ప్రాణత్యాగం సమస్యలకు పరిష్కారం కాదు.అసలు బాధల్లేని మనిషెవరు ఈ భూమ్మీద..చెప్పండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అందరికీ కష్టాలుంటాయి. తట్టుకుని నిలబడడమే కదా జీవితం అంటే!’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
ప్రాణత్యాగం సమస్యలకు పరిష్కారం కాదు. అసలు బాధల్లేని మనిషెవరు ఈ భూమ్మీద.. చెప్పండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అందరికీ కష్టాలుంటాయి. తట్టుకుని నిలబడడమే కదా జీవితం అంటే!#SayNoToBettingApps pic.twitter.com/ntRCm8Ee1z
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 6, 2025