ఆడియెన్స్‌పై దాడికి యత్నించిన పాక్ క్రికెటర్..

-

పాకిస్తాన్ జట్టు మరో వివాదంలో చిక్కుకున్నది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి పేలవమైన ప్రదర్శనతో ఇప్పటికే భారీ విమర్శలను మూటగట్టుకుంటున్న పాక్ జట్టు నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

ఈ క్రమంలోనే పాక్ రిజర్వ్ ఆటగాడు ఖుషిల్ షా ఇద్దరు ప్రేక్షకులతో గొడవపడ్డాడు.వారిని కొట్టేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ ఇద్దరు అఫ్గాన్ దేశస్థులు తమ దేశాన్ని కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని.. అందుకే పాక్ క్రికెటర్ అలా ప్రవర్తించాడని సంజాయిషీ ఇచ్చుకుంది. కాగా, పాక్ పేలవ ప్రదర్శన పట్ల పెద్దఎత్తున విమర్శలు వస్తుండటంతో ఆటగాళ్లు సహనం కోల్పోతున్నట్లు కథనాలు రావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news