గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ ఒలక పోస్తే తప్ప అవకాశాలు రావు అన్న తరుణంలో చాలామంది హీరోయిన్లు ఇలా గ్లామర్ షో చేస్తూ యువతకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో అను ఇమ్మాన్యుయెల్ కూడా ఒకరు.. మజ్ను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరియర్ను మొదలుపెట్టింది. ముందుగా తన మాతృభాష మలయాళం లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత తెలుగులో నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యి.. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా అవకాశాలు అందుకుంది.
ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కూడా ఆడి పాడింది.. ఎంత వేగంగా స్టార్ హీరోలకి జోడిగా ఛాన్సులు అందుకుందో.. అంతే వేగంగా అవకాశాలు కోల్పోతూ వచ్చింది. దీంతో గ్లామర్ తో మెప్పించే ఈ అమ్మడి హాట్ లుక్స్ కి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. దీంతో తక్కువ సమయంలోనే కావాల్సినంత ఇమేజ్ లభించింది. ఇకపోతే చివరిగా గతేడాది అల్లు శిరీష్ కి జోడిగా ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో క్రేజ్ లభించలేదు.. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాలో నటిస్తోంది.
అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా సిల్క్ శారీలో ఎద అందాలు కనిపించే విధంగా హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాజూకుతనంతో వయ్యారంగా కట్టిపడేస్తున్న ఈ ఫోటోలు ఎక్కడో బెడ్ రూమ్ లొకేషన్ ఫీచర్ చూస్తూ ఉంటే కనిపిస్తోంది.. ఏది ఏమైనా హిట్స్ పడకపోయినా సరే కిల్లింగ్ లుక్ తో హాట్ గ్లామర్ తో యువతను తన వశం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.