తెలంగాణ ఒక అఫ్ఘానిస్తాన్..కేసీఆర్ ఓ తాలిబన్ – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ఒక అఫ్ఘానిస్తాన్..కేసీఆర్ ఓ తాలిబన్ అంటూ వైఎస్ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న తనను అరెస్ట్‌ చేయడంపై షర్మిల స్పందించారు.తెలంగాణలో ఆడవాళ్లు ప్రశ్నించకుండా, పాదయాత్ర చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. ఒక మహిళ అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేక దాడులు చేయిస్తూ పాదయాత్రను అడ్డుకుంటున్నారు. మహిళను పట్టుకొని కొజ్జవాళ్లు, మరదళ్లు, శిఖండి, నల్లిని నలిపేసినట్టు నిలిపేస్తాం అంటూ దుర్భాషలాడుతున్నారని నిప్పులు చెరిగారు.


వాళ్లు మాట్లాడితే ఒప్పు, మేం మాట్లాడితే తప్పు. మహిళలకు గౌరవం ఇవ్వరు. కనీసం ఇచ్చిన హామీలైనా నెరవేర్చరు. రోజూ దోచుకోవడం, కబ్జాలు చేయడం, ప్రశ్నిస్తే హింసించడం ఇదీ బీఆర్ఎస్ నాయకుల తీరు. పాదయాత్రను అడ్డుకోవచ్చు కానీ మా పోరాటాన్ని ఆపలేరు. బీఆర్ఎస్ అవినీతిని అడుగడుగునా ఎండగడతాం. బరాబర్ ప్రశ్నిస్తాం. ప్రజల తరఫున నిలదీస్తామన్నారు.ఎనిమిదేండ్లుగా ఎవరూ ప్రశ్నించలేనిది.. ఒక మహిళ వచ్చి, ఊరూరు తిరిగి ప్రశ్నిస్తుందని, నాపై కుట్ర చేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు.ముఖ్యమంత్రి కొడుకు వత్రాలు అంటాడు.మంత్రులేమో మరదళ్లు, శిఖండి అని తిడతారు. ఎమ్మెల్యేలు కొజ్జా అని దూషిస్తారు. మీరు మాట్లాడితే ఒప్పు, మేం బదులిస్తే తప్పా? అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version