సాయం చేస్తానని అమీర్ ఖాన్ ఫోన్ ఎత్తలేదు.. అనుపమ్ సోదరుడు షాకింగ్ కామెంట్స్.. !

-

బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ ఇటీవల అనారోగ్యం బారిన పడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనుప‌మ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన డయాలసిస్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆగస్టు 9న కన్నుమూసారు. అనుప‌మ్ ల‌గాన్, స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ లాంటి సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్, టీవీ షోలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ తమ్ముడు అనురాగ్ సంచలన విషయాలు బయటపెట్టారు.

ameer khan anupam shyam

అనుపమ్ శ్యామ్ కు ఆరోగ్యం క్షీణించిన సమయంలో తమ తల్లి కూడా అనారోగ్యంతో మరణించింద‌ని చెప్పారు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. దాంతో తనతో కలిసి నటించిన కొందరు నటీనటులను ఆర్థిక సహాయం చేయవలసిందిగా అనుపమ్ కోరారని చెప్పారు. అందులో అమీర్ ఖాన్ కూడా ఉన్నార‌ని చెప్పారు. అమీర్ ఖాన్ కు ఫోన్ చేసి సాయం చేయాల‌ని కోర‌గా ముందు సాయం చేస్తా అని చెప్పి ఆ తర్వాత అమీర్ ఖాన్ తమ ఫోన్ కాల్ నువ్వు అసలు లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనురాగ్ చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version