క్రికెటర్ తో ప్రేమలో అనుష్క…!

-

దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినా సరే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనుష్క. వరుసగా సినిమాలు చేస్తూ ఆమె టాలివుడ్, తమిళంలో తన హవా కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా విమెన్ ఓరియె౦టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. అవి కూడా ఎవరితో పడితే వాళ్ళతో చేయకుండా జాగ్రత్తలు పడుతుంది. అదంతా బాగానే ఉంది గాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది…?

ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పట్లో దొరికే విధంగా కనపడటం లేదని అంటుంది టాలివుడ్. అవును అసలు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయో ఎవరికి తెలియడం లేదు. సాధారణంగా హీరోయిన్లు మూడు పదుల వయసు దాటగానే చేసుకుంటారు. సినిమా ఆఫర్లు ఉంటే పెళ్లి చేసుకుని భర్తను ఒప్పించి సినిమాలు చేస్తారు. కాని అనుష్క మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు.

అయితే తాజాగా ఆమె ఉత్తరాదికి చెందిన ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ క్రికెటర్ ని ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. ఈ ఏడాది జూన్ లో వివాహం చేసుకునే అవకాశం ఉందనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఎంత వరకు నిజమో మరి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version