షాకింగ్; రెండు వేల నోటు ఆపేశారు…?

-

“2000 రూపాయల నోట్లు గురించి ఇపుడు అన్ని బ్యాంక్ లకు సమాచారం వస్తోంది. నేను గంట క్రితం రాస్తే ఫేక్ న్యూస్ అన్న కొందరు బ్యాంక్ మేనేజర్ లు ఇప్పుడు appreciate చేస్తున్నారు నన్ను. 🙂 నేను ఆధారాలు లేనిదే ఎప్పుడూ ఏది రాయను. రేపటి నుండి ఏటీఎం లలో 2000 నోట్లు పెట్టరు. బ్యాంక్ లు కస్టమర్ లకు వాటిని ఇవ్వకూడదు. కేవలం డిపాజిట్ చేయొచ్చు అంతే.”

ప్రముఖ టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా రెండు వేల నోటు రద్దు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ వస్తుంది. నల్ల ధనం అరికట్టే ప్రక్రియలో భాగంగా నాలుగేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

తాజాగా మరోసారి ఈ వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు వేల నోటు రద్దు అయ్యే కాశం ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు నల్లమోతు శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే రద్దు అయ్యే అవకాశం ఉందని కాబట్టి మీరు జాగ్రత్త పడితే మంచిది అంటూ సూచిస్తున్నారు పలువురు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version