పెళ్ళిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుష్క శెట్టి..

-

ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందనే విషయమై ఎన్నో వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క పెళ్ళిపై రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తన సహ నటుడు ప్రభాస్ తో పెళ్ళి జరుగుతుందని పుకార్లు షికారు చేసాయి.. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో తన స్నేహం గురించి చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది.

తాజాగా అనుష్క తన పెళ్ళిపై వస్తున్న వార్తలకి మరోసారి స్పందించింది. వైవాహిక జీవితంపై తనకి చాలా నమ్మకం ఉందని, ఆ తర్వాత పిల్లలు మొదలగు వాటిని తాను అనుభవించాలని ఉందని పేర్కొంది. కాకపోతే ఆదరా బాదరగా పెళ్ళి గురించి నిర్ణయం తీసుకోబోనని, సరైన వ్యక్తి దొరికితే పెళ్ళి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. మొత్తానికి అనుష్క పెళ్ళి గురించి బాధపడుతున్న వారికి సరైన సమాధానం దొరికినట్టే. మరి అనుష్కకి కావాల్సిన వరుడు ఎప్పుడు దొరుకుతాడో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version