దేశంలో మరో కీలక ఉగ్రవాది అరెస్ట్…!

-

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అల్-ఖైదా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ లో నివసిస్తున్న నిందితుడు అబ్దుల్ మోమిన్ మొండల్ (32)ను పశ్చిమ బెంగాల్, కేరళకు చెందిన అల్-ఖైదా కేసుకు సంబంధించి అరెస్టు హేసారు. దేశంలో అనుమానాస్పద అల్-ఖైదా మాడ్యూల్‌కు సంబంధించి బెంగాల్ నుంచి పట్టుబడిన తొమ్మిదవ వ్యక్తి అతను.

10 మందికి పైగా సభ్యులతో కూడిన జిహాదీ ఉగ్రవాదుల బృందం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థ 2020 సెప్టెంబర్ 11 న కేసు నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియు కేరళతో సహా భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో దేశ వ్యతిరేక మరియు ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తున్న ఉగ్రవాదులను అరెస్ట్ చేసామని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని రాయ్‌పూర్ దారుర్ హుడా ఇస్లామియా మదర్సాలో నిందితుడు అబ్దుల్ మోమిన్ మొండల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version