ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుంది : సీఎం చంద్రబాబు

-

ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు.. రాణిస్తారు. అన్ని దేశాల్లో తెలుగు వారి ప్రింట్ ఉంటుంది. అదే మన గొప్పతనం అని తెలిపారు. ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..? అని ఆశ్చర్యపోయానని తెలిపారు.

మరోజన్మ ఉంటే తెలుగు వారిగా పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు. చదువులో ఆడపిల్లపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పాను. పురుషుల కంటే మహిళలే తెలివైన వారని నిరూపితమైంది. ప్రస్తుతం యువకుల కంటే యువతులే ఎక్కువగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. హైదరాబాద్ లో భూములు అమ్ముకోవద్దని చాలా మందికి చెప్పాను. హైదరాబాద్ లో భూములకు అధిక ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణ తలసరి ఆదాయం హైదరాబాద్ సంపదే కారణం అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version