లోకేష్ కు డిప్యూటీ సీఎం అనేదానిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..!

-

రామతీర్థంలో రాములు వారి శిరస్సును ఛేదించిన వ్యవహారాన్ని అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ఖండించాం అని బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే తరువాత దర్యాప్తు లో కొందరిని నిందుతులుగా చేర్చాం. ఓ నిందితుడికు సీఎం సహాయ నిధి నుంచి అయిదు లక్షలు ఇచ్చారు. ఇదీ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు చేతులు మీదుగా ఇచ్చారు. ఓ నిందుతుడికి ఇలా సీఎం సహాయ నిధు నుంచి ఇచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. కేసు ఫాల్స్ అని తేల్చాక ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి. కేసులున్న వ్యక్తి కి ఎలా ఇస్తారు. దర్యప్తు చేసి ఎవ్వరు దీనికి కారకులో గుర్తించి చర్యలు తీసుకోడానికి ప్రయత్నించండి. రాములు వారి శిరస్సు ఛేదనలో నిందితుడికు ఎప్పుడూ నిప్పు అని చెప్పుకుంటున్న అశోక్ గజపతి రాజు ఇవ్వడం సిగ్గుచేటు. ఇదేదో సాధించినట్టు సీఎం సహాయ నిధిని పెద్ద ఆర్భాటం గా చెప్పుకుంటున్నారు.

అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేదా అన్నది కూటమి‌ ప్రభుత్వం నిర్ణయం. గత మా ప్రభుత్వం లో అయిదుగురు డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు ఒకరుండాల ఇద్దరుండాల అన్నది చంద్రబాబు ఇష్టం. దీనిపై మా ప్రతిస్పందన అవసరం లేదు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version