ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యల్లో కాస్త హెచ్చు తగ్గుదలలు వస్తున్నా.. దాదాపుగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితిలు నెలకొన్నాయి. కానీ మాస్క్, భౌతిక దూరం మాత్రం తప్పక పాటించాల్సి వస్తుంది. కాగ ఈ రోజు కరోనా వైరస్ బులిటెన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు.
ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 3,504 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేవలం 5 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కాగ నిన్న ఆంధ్ర ప్రదేశ్ కేవలం ఒక్క కేసు మాత్రమే వెలుగు చూశాయి. అంటే నిన్నతో పోలిస్తే.. రాష్ట్రంలో కరోనా నేడు 4 కేసులు పెరిగాయి. కాగ ఈ రోజు రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7 గురు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కేవలం 31 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.