తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!

-

మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులను ఫాలో అవుతూ ఉండాలి. అయితే నిజానికి ఆరోగ్యం బాగుండాలంటే మంచి జీవన విధానాన్ని అనుసరించాలి. దానితో పాటుగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, బాగా నిద్ర పోవడం లాంటివి చేయాలి.

ప్రతి రోజు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది. అయితే డాక్టర్లు తిన్న తర్వాత నీళ్ళు ఎక్కువ తాగకూడదు అని దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల సమస్యలు కలుగుతాయని.. బ్లోటింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి అని చెబుతున్నారు. అయితే చిన్న పిల్లలు ఆహారం తీసుకున్నాక నీళ్లు తాగచ్చు కానీ పెద్దవాళ్ళు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.

మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి రెండు గంటల సమయం పడుతుంది. అలాంటి సమయంలో నీళ్లు తాగడం వల్ల అజీర్తి సమస్యలు కలుగుతాయి. తిన్న తర్వాత 45 నిమిషాల నుండి గంట సేపు గ్యాప్ ఇచ్చి అప్పుడు నీళ్లు తాగవచ్చు. అలానే తినడానికి అరగంట ముందు వరకు కూడా నీళ్లు తాగకూడదు. తిన్న గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. అలానే జీర్ణం కూడా బాగా అవుతుంది. సరైన సమయానికి నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటివి రావు. అలాగే పోషక పదార్థాలు కూడా మనకు అందుతాయి లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే సమస్యలు:

ఒబిసిటీ
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం
అజీర్తి సమస్య
గ్యాస్ట్రిక్ సమస్య

Read more RELATED
Recommended to you

Exit mobile version