గవర్నర్ ప్రసంగం తరువాత రెండో రోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశం అయింది. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతాప తీర్మాణాన్ని అసెంబ్లీలో సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి మరణంపై మాట్లాడుతూ… వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు సీఎం జగన్.
ఆ తరువాత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతూ… గౌతం రెడ్ది మరణం చాలా లోటని ఆయన అన్నారు. ఆయన మరణంపై మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదని.. నా పక్కన సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహించే వారని ఆయన అన్నారు. నాకు అత్యంత సన్నిహితుడని.. సొంత అన్నలా ఉండేవారిని అన్నారు. ఆ తరువాత మరోమంత్రి పెద్దిరెడ్డి రామ్ చంద్రరెడ్డి మాట్లాడుతూ.. గౌతం రెడ్డి మరణం మా పార్టీకీ, వ్యక్తిగతంగా మాకు తీరని నష్టం అని అన్నారు.